పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ఖాయమైన మరో పతకం.. ఫైనల్ చేరిన రెజ్లర్ వినేశ్ ఫొగాట్
- సెమీస్‌లో క్యూబా క్రీడాకారిణి గుజ్‌మాన్‌పై గెలిచిన ఫొగాట్
- 50 కేజీల ఫ్రీస్టైల్ ఈవెంట్‌లో 5-0 తేడాతో బౌట్ గెలిచిన భారత రెజ్లర్
- స్వర్ణ పతకం కోసం ఫైనల్లో అమెరికా రెజ్లర్ సారా హిల్డెబ్రాండ్‌తో తలపడనున్న ఫొగాట్
పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్‌కు మరో పతకం ఖాయమైంది. అంచనాలను అందుకుంటూ భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్ ఈవెంట్‌లో ఫైనల్ చేరింది. సెమీఫైనల్‌లో క్యూబా రెజ్లర్ యుస్నీలిస్ గుజ్‌మాన్‌తో జరిగిన బౌట్‌లో 5-0తో విజయం సాధించింది. ఈ మ్యాచ్ ఆరంభం నుంచే ఫొగాట్ ఆధిపత్యం ప్రదర్శించింది. ప్రత్యర్థి నుంచి పెద్దగా ప్రతిఘటన లేకపోవడంతో తొలి పిరియడ్ ముగిసే సమయానికి ఫొగాట్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. రెండో పీరియడ్‌లో ఆమె 5-0తో భారీ ఆధిక్యాన్ని సాధించింది. ఈ ఆధిక్యాన్ని చివరి వరకు అలాగే కొనసాగించడంతో బౌట్ భారత వశమైంది.
ఇక స్వర్ణం కోసం జరిగే ఫైనల్ పోరులో అమెరికాకు చెందిన సారా హిల్డర్ బ్రాంట్ తో వినేశ్ ఫొగాట్ తలపడనుంది. హిల్డర్ బ్రాంట్ సెమీఫైనల్‌లో మంగోలియాకు చెందిన డోల్గోర్జావిన్‌పై విజయం సాధించి ఫైనల్ చేరుకుంది.
ఒలింపిక్స్ క్రీడల్లో రెజ్లింగ్ విభాగంలో ఫైనల్లో పతకం అందించనున్న తొలి భారతీయ మహిళగా వినేశ్ ఫొగాట్ నిలవడం ఖాయమైంది. సెమీస్‌కు చేరిన తొలి మహిళగా ఇప్పటికే రికార్డు సృష్టించారు. కాగా 2016 ఒలింపిక్స్ క్వార్టర్స్‌లో ఓడిపోయిన సాక్షి మాలిక్ కాంస్యం పతకంతో సరిపెట్టుకుంది.
అమెరికాతో ఫైనల్..
ఇక స్వర్ణం కోసం జరిగే ఫైనల్ పోరులో అమెరికాకు చెందిన సారా హిల్డర్ బ్రాంట్ తో వినేశ్ ఫొగాట్ తలపడనుంది. హిల్డర్ బ్రాంట్ సెమీఫైనల్‌లో మంగోలియాకు చెందిన డోల్గోర్జావిన్‌పై విజయం సాధించి ఫైనల్ చేరుకుంది. కాగా వినేశ్ ఫొగాట్ రౌండ్-16 బౌట్‌లో నాలుగుసార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన జపాన్ క్రీడాకారిణి యుయి సుసాకిని ఆశ్చర్యకర రీతిలో మట్టికరిపించింది. సుసాకి ఒక అంతర్జాతీయ ఈవెంట్‌లో ఒక్కసారి కూడా ఓడిపోలేదు. ఆమె ఆడిన 82 బౌట్‌లు అన్నింటిలో విజయం సాధించింది. అలాంటి ప్రత్యర్థిని వినేశ్ ఓడించి సంచలనం సృష్టించింది. అద్భుతమైన ప్రదర్శన కనపరిచింది. ఆరంభంలో 0-2తో వెనుకబడినప్పటికీ.. చివరి 3-2తో బౌట్‌ను గెలుచుకుంది. ఆ తర్వాత క్వార్టర్‌ఫైనల్స్‌లో ఉక్రెయిన్ క్రీడాకారిణి ఒక్సానా లివాచ్‌పై 7-5 తేడాతో ఫొగాట్ విజయం సొంతం చేసుకుంది.