హైదరాబాద్‌లో స్కూల్ బస్సుకు ప్రమాదం... గాయపడిన విద్యార్థుల్ని పరామర్శించిన ఎమ్మెల్యే
- కాటేదాన్ ఎన్జీవోస్ కాలనీలో బస్సుకు ప్రమాదం
- తొమ్మిది మంది విద్యార్థులకు గాయాలు
- ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులు
హైదరాబాద్‌లోని కాటేదాన్ ఎన్జీవోస్ కాలనీలో ఓ స్కూల్ బస్సుకు ప్రమాదం జరిగి తొమ్మిది మంది విద్యార్థులు గాయపడ్డారు. ఈ ఘటనలో ఎవరికీ ప్రాణహాని జరగలేదు. గాయపడిన విద్యార్థులకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వీరిని స్థానిక ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ పరామర్శించారు.
ఈ ఘటనపై రాజేంద్రనగర్ ఏసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ... కాటేదాన్‌లోని ఎన్జీవోస్ కాలనీలో ఓ స్కూల్ బస్సు ప్రమాదానికి గురైనట్లు చెప్పారు. నిలిచి ఉన్న బస్సు వెనక్కి వెళ్లి బోల్తా పడిందన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 30 మంది వరకు విద్యార్థులు ఉన్నట్లు వెల్లడించారు.
బస్సు డ్రైవర్ ఆదిల్ బస్సును నిలిపి ఉంచాడు. విద్యార్థుల్లో ఒకరు హ్యాండ్ బ్రేక్‌ను రిలీజ్ చేసినట్లుగా అనుమానిస్తున్నట్లు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్లు చెప్పారు. ఘటనలో తొమ్మిది మంది విద్యార్థులకు గాయాలయ్యాయని, వారికి ఎలాంటి ప్రాణహాని జరగలేదన్నారు.