పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ వాయిదా
- ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని హైకోర్టులో బీఆర్ఎస్ పిటిషన్
- వారిపై చర్యలు తీసుకునేలా స్పీకర్‌ను ఆదేశించాలని బీఆర్ఎస్ వాదనలు
- అనర్హత నిర్ణయంపై స్పీకర్‌కు కోర్టులు గడువు నిర్దేశించలేవన్న ఏజీ
బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల కేసు విచారణ రేపటికి వాయిదా పడింది. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై బీఆర్ఎస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. వారిపై చర్యలు తీసుకునేలా శాసన సభ స్పీకర్‌ను ఆదేశించాలని కోరింది. ఈ పిటిషన్‌పై ఈరోజు కోర్టు విచారణ జరిపింది.
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ నిర్ణయం తీసుకునేలా ఆదేశించాలని బీఆర్ఎస్ న్యాయవాది కోర్టును కోరారు. అయితే అనర్హత నిర్ణయంపై స్పీకర్‌కు కోర్టులు గడువును నిర్దేశించలేవని ఏజీ వాదించారు. రేపు బుధవారం నాడు మరిన్ని వాదనలు వినిపిస్తామని ఫిరాయింపు ఎమ్మెల్యేల తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో విచారణ రేపటికి వాయిదా పడింది.