స్వల్ప నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్... నిన్నటితో పోల్చితే కాస్త నయం!
- నిన్న కుప్పకూలిన స్టాక్ మార్కెట్ సూచీలు
- నేటి ఉదయం భారీ లాభాలతో ట్రేడిండ్ ప్రారంభం
- ఆచితూచి వ్యవహరించిన మదుపరులు
- సాయంత్రానికి నష్టాలతో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ
ఈ ఉదయం లాభాలతో ఆరంభమైన భారత స్టాక్ మార్కెట్ సూచీలు సాయంత్రానికి స్వల్ప నష్టాలతో ముగిశాయి. నిన్నటి తీవ్ర నష్టాలతో పోల్చితే నేడు స్టాక్ మార్కెట్ కొద్దిమేర కోలుకున్నట్టేనని చెప్పాలి.
ఇవాళ ట్రేడింగ్ ఆరంభంలో సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా వృద్ధి కనబర్చగా, నిఫ్టీ కూడా 300కి పైగా పాయింట్లు లాభపడింది. అయితే, అంతర్జాతీయ పరిణామాలు అనిశ్చితికరంగా ఉండడంతో మదుపరులు ఆచితూచి వ్యవహరించడంతో సెన్సెక్స్, నిఫ్టీలకు నష్టాలు తప్పలేదు.
సెన్సెక్స్ 166 పాయింట్ల నష్టంతో 78,593 వద్ద ముగియగా, నిఫ్టీ 63 పాయింట్ల నష్టంతో 23,992 వద్ద స్థిరపడింది.
అదాని పోర్ట్స్, బ్రిటానియా ఇండస్ట్రీస్, హెచ్ యూఎల్, హెచ్ సీఎల్ టెక్నాలజీస్, సిప్లా కంపెనీల షేర్లు లాభాల బాటలో పయనించగా... హెచ్ డీఎఫ్ సీ లైఫ్, ఎస్బీఐ లైఫ్, బీపీసీఎల్ షేర్లు నష్టాలు చవిచూశాయి.
ఇక, డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.83.95గా ఉంది.