ఫిజీ దేశపు అత్యున్నత పౌర పురస్కారం అందుకున్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- పసిఫిక్ దేశాల్లో పర్యటిస్తున్న భారత రాష్ట్రపతి
- ఫిజీ పర్యటనలో ముర్ముకు విశిష్ట గౌరవం
- 'కంపానియన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఫిజీ' ప్రదానం
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పసిఫిక్ దేశాల్లో పర్యటిస్తున్నారు. తాజాగా, ఫిజీ దేశంలో పర్యటిస్తున్న ద్రౌపది ముర్ముకు ఆ దేశ ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారం 'కంపానియన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఫిజి' ప్రదానం చేసింది.
ఫిజీ అధ్యక్షుడు రటు విలియమే మైవాలిలి కటోనివెరే ఇవాళ జరిగిన ఓ కార్యక్రమంలో ఈ పురస్కారంతో భారత రాష్ట్రపతిని గౌరవించారు. దీనిపట్ల ద్రౌపది ముర్ము ఫిజీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఇరుదేశాల మధ్య ఉన్న సంబంధాలను ముర్ము ఈ సందర్భంగా ప్రస్తుతించారు. ఫిజీని దృఢమైన, స్థితిస్థాపక, సుసంపన్న దేశంగా మలిచే దిశగా భారత్ భాగస్వామ్యం కుదుర్చుకునేందుకు సంసిద్ధంగా ఉందని ముర్ము స్పష్టం చేశారు.