మా ఆయనకి జరిగిన ప్రమాదం .. 11 ఏళ్ల పాటు నా కష్టాలు: నటి అనురాధ
- నటిగా .. డాన్సర్ గా అలరించిన అనూరాధ
- జయమాలిని .. జ్యోతిలక్ష్మి నుంచి గట్టిపోటీ
- 1987లో కొరియోగ్రఫర్ తో వివాహం
- 1996లో ప్రమాదానికి గురైన సతీశ్
ఒక వైపున జయమాలిని .. జ్యోతిలక్ష్మి వెండితెరపై తమజోరు చూపుతూ ఉండగానే, మరో వైపున అనూరాధ తన ప్రత్యేకతను చాటుకుంటూ దూసుకెళ్లారు. అలాంటి అనూరాధ తాజాగా ఐ డ్రీమ్ వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో, తనకి సంబంధించిన అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. "13 ఏళ్ల వయసులోనే నేను ఇండస్ట్రీకి వచ్చాను. నాలుగు భాషలలో హీరోయిన్ గా 32 సినిమాలు చేశాను" అని అన్నారు.
" సతీశ్ అనే కొరియోగ్రఫర్ తో 1987లో నా వివాహం జరిగింది. ఒక పాప - బాబు పుట్టిన తరువాత, 1996లో ఆయనకి పెద్ద యాక్సిడెంట్ అయింది. తలకి బలమైన దెబ్బ తగలడం వలన, ఆయన అంతా మరిచిపోయారు. తాను ఏం చేస్తున్నది కూడా తనకి తెలియదు. నేను కనిపించకపోతే, ఒక పసిపిల్లవాడి మాదిరిగా వెతుక్కునేవాడు" అని అన్నారు.
"మాకు ఇద్దరు పిల్లలు .. అంతకుముందే అమ్మ చనిపోయింది. ఏమీ తెలియని స్థితిలో భర్త. అతణ్ణి ఎలా చూసుకుంటానా అని మా అత్తగారు .. ఆడపడుచులు కంగారు పడ్డారు. మా వారిని చూసుకోవడానికి మనిషిని పెడతానని అనుకున్నారు. కానీ నేను దగ్గరుండి ఆయనను చూసుకున్నాను. అలా 11 ఏళ్లపాటు చాలా కష్టాలు పడ్డాను. ఇక కోలుకుంటాడని అనుకుంటూ ఉండగా ఆయన చనిపోవడం మమ్మల్ని మరింత బాధపెట్టింది" అంటూ ఉద్వేగానికి లోనయ్యారు.