దక్షిణాఫ్రికా టీ20 లీగ్ బ్రాండ్ అంబాసిడర్‌గా దినేష్ కార్తీక్
- ఎస్ఏ20లో అంబాసిడర్‌గా చేరినందుకు థ్రిల్లింగ్‌గా ఉందన్న దినేష్ కార్తీక్
- గ్రేమ్ స్మిత్, అతని బృందంతో కలిసి చేయడానికి ఎదురు చూస్తున్నానంటూ వ్యాఖ్య
- ఎస్ఏ20 సీజన్3కి అంబాసిడర్‌గా కార్తీక్‌ను స్వాగతించడం పట్ల తాము ఆసక్తిగా ఉన్నామన్న స్మిత్
దక్షిణాఫ్రికాకు చెందిన ఎస్ఏ20 లీగ్‌కు భారత మాజీ వికెట్‌కీపర్, బ్యాటర్ దినేశ్ కార్తీక్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించారు. ప్రపంచ కప్ విజేతగా, మాజీ భారత జాతీయ ఆటగాడిగా కార్తీక్‌కు ఉన్న అపారమైన క్రికెట్ నైపుణ్యం ఈ లీగ్ ను ప్రపంచంలోని అగ్రశ్రేణి ఫ్రాంచైజీ లీగ్‌లలో ఒకటిగా నిలబెట్టడంలో తోడ్పడుతుందని ఎస్ఏ20 లీగ్ నిర్వాహకులు తెలిపారు. దీనిపై దినేశ్ కార్తీక్ స్పందించాడు.
"బెట్‌వే ఎస్ఏ20లో అంబాసిడర్‌గా చేరినందుకు థ్రిల్లింగ్‌గా ఉంది. లీగ్ మొదటి రెండు సీజన్‌లలో ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్ళతో పాటు అద్భుతమైన నైపుణ్యం కలిగిన యువ ఆటగాళ్లను ఒక వేదికపైకి తేవడంలో లీగ్ సక్సెస్ అయింది. ఇది ఒక విశేషం. బెట్‌వే ఎస్ఏ20తో మంచి అనుబంధం కలిగి ఉన్న గ్రేమ్ స్మిత్, అతని బృందంతో కలిసి పనిచేయడానికి ఎదురు చూస్తున్నాను" అని కార్తీక్ తెలిపాడు.
39 ఏళ్ల దినేశ్ కార్తీక్ 2008లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమైనప్పటి నుండి వివిధ ఫ్రాంచైజీలకు ఆడుతూ టీ20 క్రికెట్‌లో అపారమైన అనుభవం కలిగి ఉన్నాడు. 16 ఏళ్ల తన ఐపీఎల్ కెరీర్‌లో ఏకంగా ఆరు ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించాడు. తన ఐపీఎల్ కెరీర్‌లో 26.32 సగటు, 135.66 స్ట్రైక్ రేట్‌తో 4,842 పరుగులు చేశాడు. అలాగే వికెట్ కీపర్‌గా 145 క్యాచ్‌లు, 37 స్టంపింగ్‌లు చేశాడు. పొట్టి ఫార్మాట్‌లో అత్యుత్తమ ఫినిషర్‌లలో ఒకరిగా పేరు తెచ్చుకున్నాడు.
ఎస్ఏ20 లీగ్ కమిషనర్ గ్రేమ్ స్మిత్ మాట్లాడుతూ, బెట్‌వే ఎస్ఏ20 సీజన్3కి అంబాసిడర్‌గా కార్తీక్‌ను స్వాగతించడం పట్ల తాము ఆసక్తిగా ఉన్నామన్నారు. "అతని అసాధారణమైన క్రికెట్ ప్రతిభ, వ్యక్తిత్వం అతనిని మా మా లీగ్‌కు సరిగ్గా సరిపోయేలా చేసింది. అతని ప్రమేయం నిస్సందేహంగా ప్రపంచవ్యాప్తంగా, భారతదేశంలో లీగ్ స్థితిని మెరుగుపరుస్తుంది. మేము రాబోయే అద్భుతమైన సీజన్ కోసం ఎదురు చూస్తున్నాము. టోర్నీ విజయవంతం కావడంలో డీకే కీలక పాత్ర పోషిస్తాడు" అని చెప్పుకొచ్చాడు.