నోబెల్ గ్రహీత ముహమ్మద్ యూనస్ బంగ్లా తాత్కాలిక ప్రభుత్వానికి నాయకత్వం వహించాలని విద్యార్థి నాయకుల పిలుపు
- బంగ్లా రాజధాని ఢాకాలో ఆందోళనకారుల విధ్వంసం
- దేశం విడిచి వెళ్లిపోయిన ప్రధాని షేక్ హసీనా
- తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుకు అధ్యక్షుడు మహ్మద్ షహబుద్దీన్ ఆమోదం
పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ కోటా వ్యతిరేక ఉద్యమం తీవ్రం కావడంతో ఆ దేశ ప్రధానమంత్రి షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం ఆమె దేశం విడిచి వెళ్లడంతో తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుకు అధ్యక్షుడు మహ్మద్ షహబుద్దీన్ సోమవారం రాత్రి ఆమోదం తెలిపారు. దాంతో నోబెల్ గ్రహీత ముహమ్మద్ యూనస్ మధ్యంతర ప్రభుత్వానికి నాయకత్వం వహించాలని విద్యార్థి నాయకులు పిలుపునిచ్చినట్లు ఢాకా ట్రిబ్యూన్ తెలిపింది.
విద్యార్థి నాయకులు నహిద్ ఇస్లాం, ఆసిఫ్ మహమూద్, అబ బకర్ మజుందార్ మంగళవారం తెల్లవారుజామున విడుదల చేసిన వీడియో సందేశంలో ఈ ప్రకటన చేసినట్లు న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. కాగా, సివిల్ సర్వీస్ ఉద్యోగాల కోటాలకు వ్యతిరేకంగా గత నెలలో ప్రారంభమైన నిరసన ర్యాలీలు ప్రధాని హసీనా 15 ఏళ్ల పాలనకు ముగింపు పలికే వరకు వెళ్లింది. అలాగే దేశంలో తీవ్ర అశాంతికి దారితీశాయి.
ఆందోళనకారుల నిరసనలు హింసాత్మకంగా మారడంతో వందలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత హసీనా నిష్క్రమణ జరిగింది. ఇక దేశంలో క్షీణిస్తున్న శాంతిభద్రతల పరిస్థితిని పరిష్కరించడానికి అధ్యక్ష భవనం బంగాభబన్‌లో సమావేశం జరిగింది. ఈ భేటీలో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ చీఫ్‌లు, రాజకీయ పార్టీల నాయకులు, పౌర సమాజ సభ్యులు పాల్గొన్నారు. అంతకుముందు దేశాన్ని నడిపేందుకు మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అధ్యక్షుడు మహ్మద్ షహబుద్దీన్ సోమవారం రాత్రి ఆమోదం తెలిపారు.
బంగాభబన్ అసిస్టెంట్ ప్రెస్ సెక్రటరీ ముహమ్మద్ షిప్లూ జమాన్ సంతకం చేసిన పత్రికా ప్రకటన ప్రకారం.. ఆర్మీ, నేవీ , ఎయిర్ ఫోర్స్ చీఫ్‌లు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, పౌర సమాజ సభ్యులతో ప్రస్తుత పరిస్థితులపై చర్చించిన తర్వాత బంగాభబన్‌లో జరిగిన సమావేశంలో తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. సోమవారం మధ్యాహ్నం షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిన తర్వాత విధ్వంసక చర్యలను అరికట్టడం, చట్టాన్ని అమలు చేసేలా చూడడం సైన్యానికి అప్పగించడం జరిగింది.