గోదావరి గట్టున నేల కూలిన భారీ వృక్షం .. దీని ప్రత్యేకత ఏమిటంటే..!
- తూర్పు గోదావరిలో నేలకూలిన సినీ వృక్షం
- సినిమాల్లో అద్భుత సన్నివేశాలకు వేదికగా నిలిచిన ఈ నిద్రగన్నేరు చెట్టు
- ఈ వృక్షం వద్దే 300కుపైగా సినిమాల్లోని సన్నివేశాల చిత్రీకరణ
తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం గోదావరి ఒడ్డున 150 ఏళ్ల నాటి ఓ భారీ వృక్షం నేలకొరిగింది. దాదాపు 150 ఏళ్లుగా ఎన్నో ప్రకృతి విపత్తులను ఎదుర్కొని నిలిచిన ఈ నిద్రగన్నేరు చెట్టు సోమవారం పడిపోయింది. గోదావరి ఒడ్డున ప్రకృతి సోయగాలకు చిరునామాగా ఉన్న ఈ చెట్టుకు ఓ ప్రత్యేకత ఉంది. అది ఏమిటంటే.. వందల సినిమాల్లో అద్భుత సన్నివేశాలకు ఈ భారీ వృక్షం వేదికగా నిలిచింది.
ప్రముఖ దర్శకుడు బాపు, కె.విశ్వనాథ్, కె.రాఘవేంద్రరావు తదితరులు ఈ ప్రదేశంలో చిత్రాలను రూపుదిద్దారు. దాదాపు 300కుపైగా సినిమాల్లో పలు సన్నివేశాలు, పాటలను ఈ చెట్టు వద్దే చిత్రీకరించారు. దీంతో ఇది సినీ వృక్షంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. ప్రముఖ నటులు అక్కినేని నాగేశ్వరరావు, చిరంజీవి, కృష్ణ, కృష్ణంరాజు, బాలకృష్ణ, మోహన్ బాబు తదితరుల సినిమాలలోని పాటల సన్నివేశాలను ఇక్కడే చిత్రీకరించారు.
1976లో వచ్చిన 'పాడి పంటలు' సినిమాతో ఈ వృక్షంకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. శంకరాభరణం, త్రిశూలం, సీతారామయ్య గారి మనవరాలు తదితర సినిమాల్లో ముఖ్యమైన సీన్ లను ఇక్కడే నిర్మాణం చేశారు. అయితే ఈ సినీ వృక్షం సంరక్షణ విషయంలో పాలకులు, అధికార యంత్రాంగం ప్రత్యేక శ్రద్ద తీసుకోలేదని అక్కడి గ్రామస్తులు చెబుతుంటారు. ప్రతి ఏటా వచ్చే వరదలకు గోదావరి గట్టు కొద్దికొద్దిగా దిగబడి చివరకు చెట్టు మొదలు రెండుగా చీలి సోమవారం పడిపోయింది.