ఆలయాలు ఎత్తైన ప్రదేశంలో ఎందుకు ఉంటాయి?.. దేశంలో ఎత్తైన ఆలయం ఏది?

భారతదేశంలో ఎన్నో అత్యద్భుతమైన దేవాలయాలు ఉన్నాయి. వాటిలో అత్యధికం ఎత్తైన ప్రదేశాలలో నిర్మితమైనవే. ఎత్తైన ప్రాంతాలు పవిత్రమైనవి అనేది భారతీయ సంప్రదాయం. అందుకే కొండలు, పర్వతాల్లో  ఆలయాలు కొలువై ఉంటాయి. మరోవైపు దేవుళ్ల దృష్టిలో అందరూ సమానమేనని, ఈ సర్వోన్నతభావం మనుషులకు అర్థమవ్వాలనే ఉద్దేశంతో గుళ్లను వీలైనంత ఎత్తులో నిర్మిస్తుంటారనే నమ్మకం ఉంది. 

ఎత్తైన ప్రదేశంలో ఉండే ఆలయాలు భక్తులకు దూరం నుంచే కనిపిస్తుంటాయి. దీంతో భక్తులు దూరం నుంచే ఆలయాలకు నమస్కరించుకునే అవకాశం దక్కుతుంది. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ఎత్తైన ప్రాంతాన్ని చూసి గుళ్లను నిర్మిస్తుంటారు. మరి మనదేశంలో అత్యంత ఎత్తైన ప్రదేశంలో ఉన్న ఆలయాలు ఏవి? ఎక్కడ ఉన్నాయి? అని తెలుసుకోవాలని ఉందా! అయితే ఇంకెందుకు ఆలస్యం ‘ఏపీ7ఏఎం’ రూపొందించిన ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.


More Telugu News