అక్టోబర్ 2న ఏపీ విజన్ డాక్యుమెంట్ 2047 విడుదల .. కలెక్టర్ లకు చంద్రబాబు కీలక సూచన
- పొలిటికల్ గవర్నెన్సే ఉంటుందన్న సీఎం చంద్రబాబు
- ప్రజా ప్రతినిధులను కలెక్టర్ లు గౌరవించాలని సూచన
- ఆకస్మిక తనిఖీలు ఉంటాయని అధికారులకు చంద్రబాబు హెచ్చరిక
అక్టోబర్ 2న ఆంధ్రప్రదేశ్ విజన్ డాక్యుమెంట్ 2047 విడుదల చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. సోమవారం కలెక్టర్ లతో నిర్వహించిన కాన్ఫరెన్స్ లో ప్రభుత్వ ప్రాధాన్యతలపై చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. అధికారులు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలన్నారు. పొలిటికల్ గవర్నెన్స్ ఉంటుందని కలెక్టర్ లకు చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం వచ్చే ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలను కలెక్టర్ లు గౌరవించాలని తెలిపారు. ఇకపై తాను ఆకస్మిక తనిఖీలకు వస్తానని, మురుగు కాల్వలను కూడా చెక్ చేస్తానని, అధికారులు సిద్ధంగా ఉండాలని చంద్రబాబు హెచ్చరించారు. ఇదే సందర్భంలో 1995 లో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఐఏఎస్ లు మురుగు కాల్వలలోకిదిగి పరిశీలించాలని చెప్పేవాడినని, ఇప్పుడు కూడా అలాంటి చంద్రబాబును చూస్తారని ముఖ్యమంత్రి అన్నారు.
కలెక్టర్లు నిబంధనల వైపే కాకుండా మానవత్వ కోణంలోనూ పని చేయాలని చంద్రబాబు సూచించారు. అక్టోబర్ 2న ఏపీ విజన్ డాక్యుమెంట్ 2047 విడుదల చేస్తానని తెలిపిన సీఎం చంద్రబాబు.. జిల్లాలకు విజన్ డాక్యుమెంట్ రూపొందించుకోవాలని సూచించారు. అలానే ఎప్పటికప్పుడు తప్పుడు ప్రచారాలపై అప్రమత్తంగా ఉంటూ వాటిని కౌంటర్ చేయాలని కలెక్టర్లు, అధికారులకు చంద్రబాబు సూచించారు. గత అయిదేళ్ల పాలన ఐఏఎస్ వ్యవస్థను దిగజార్చేలా సాగిందని చంద్రబాబు విమర్శించారు.