ఆల్ ది బెస్ట్ బసవయ్య: ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆసక్తికర ట్వీట్

  • ఆర్థిక ఇబ్బందులతో ఐఐటీలో చేరలేకపోతున్నానంటూ బసవయ్య అనే విద్యార్థి ట్వీట్
  • రూ.4 లక్షల ఫీజు చెల్లించలేనని ఆవేదన
  • ఫీజు విషయం నేను చూసుకుంటా... నువ్వు చదువుకో అంటూ లోకేశ్ భరోసా
  • లోకేశ్ ను ప్రశంసించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు
ఆర్థిక ఇబ్బందులతో లక్నో ఐఐటీలో చేరలేకపోతున్నానంటూ అత్తిలికి చెందిన బసవయ్య అనే విద్యార్థి ఆవేదన వ్యక్తం చేయగా, నేనున్నా తమ్ముడూ... ఫీజు విషయం నేను చూసుకుంటా అంటూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్  ఆ విద్యార్థికి భరోసా ఇవ్వడం తెలిసిందే. 

దీనిపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్పందించారు. మంత్రి నారా లోకేశ్ ను ప్రశంసించారు. నారా లోకేశ్ స్పందించి విద్యార్థికి చేసిన సాయం స్ఫూర్తిదాయకం అని కొనియాడారు. తన కల సాకారం అవుతుందని ఆ విద్యార్థి ఊహించి ఉండడని అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. ఆల్ ది బెస్ట్ బసవయ్య అంటూ తాను కూడా ఆ విద్యార్థికి శుభాకాంక్షలు  తెలిపారు. 

కాగా, లక్నో ఐఐటీలో ఫీజు రూ.4 లక్షలు ఉందని, అంత ఖర్చు తన కుటుంబం భరించలేని స్థితిలో ఉందని బసవయ్య మంత్రి నారా లోకేశ్ ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు. తన తల్లిదండ్రులు కూలి పనులు చేసుకునే పేదవాళ్లని బసవయ్య పేర్కొన్నాడు. 

ఈ ట్వీట్ పై స్పందించిన నారా లోకేశ్... బసవయ్యా, నీ కల నెరవేర్చే బాధ్యత నాది అంటూ పూర్తి భరోసా అందించారు. దాంతో, నారా లోకేశ్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది.


More Telugu News