కవిత డిఫాల్ట్ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

  • ఇటీవల డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన కవిత
  • సీనియర్ అడ్వకేట్ అందుబాటులో లేరని కవిత విజ్ఞప్తి
  • ఎల్లుండికి విచారణను వాయిదా వేసిన న్యాయస్థానం
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ ఎల్లుండికి వాయిదా పడింది. ఇప్పటికే కవిత దాఖలు చేసిన పలు బెయిల్ పిటిషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో ఆమె డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఈ రోజు విచారణ జరిగింది.

తదుపరి విచారణను రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరీ భవేజా ఆగస్ట్ 7కు వాయిదా వేశారు. సీనియర్ అడ్వకేట్ అందుబాటులో లేకపోవడంతో కేసును మరో రోజుకు వాయిదా వేయాలని కవిత తరపు న్యాయవాది న్యాయస్థానాన్ని కోరారు. ఈ క్రమంలో తదుపరి విచారణను జడ్జి వాయిదా వేశారు.

ఇదిలావుంచితే, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులు ఢిల్లీకి వెళ్లారు. వారు రెండు రోజుల పాటు ఢిల్లీలో వుంటారు. కేటీఆర్, హరీశ్ రావు రేపు తీహార్ జైల్లో కవితను కలవనున్నారు.


More Telugu News