పారిస్ ఒలింపిక్స్: సెమీస్‌కు దూసుకెళ్లిన భారత హాకీ జట్టుకు భారీ షాక్
- జర్మనీతో సెమీస్‌లో తలపడనున్న భారత జట్టు
- భారత డిఫెండర్ అమిత్ రోహిత్‌దాస్‌పై ఒలింపిక్ కమిటీ ఒక మ్యాచ్ నిషేధం
- అసంతృప్తి వ్యక్తం చేసిన భారత హాకీ సంఘం
పారిస్ ఒలింపిక్స్‌లో సెమీస్ చేసిన భారత హాకీ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. జర్మనీతో మంగళవారం జరగనున్న సెమీస్‌కు కీలక ఆటగాడు, డిఫెండర్ అమిత్ రోహిదాస్ అందుబాటులో ఉండడం లేదు. బ్రిటన్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో ప్రత్యర్థి ఆటగాడికి స్టిక్ తగిలించాడన్న కారణంతో ఒలింపిక్ కమిటీ అమిత్‌పై వేటు వేసింది. ఒక మ్యాచ్ నిషేధం విధించింది.
బ్రిటన్‌తో జరిగిన మ్యాచ్‌లో అమిత్ రెడ్‌కార్డ్ అందుకుని బయటకు వెళ్లాడు. అయినప్పటికీ భారత జట్టు 10 మందితోనే ప్రత్యర్థిని ఎదుర్కొని విజయం సాధించింది. అమిత్‌పై ఒలింపిక్ కమిటీ వేటు వేయడాన్ని భారత హాకీ సంఘం తీవ్రంగా స్పందించింది.
ఇలాంటి ఘటనల వల్ల ఆటగాళ్లకు ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేసింది. క్రీడా సమగ్రతను కాపాడేందుకు భవిష్యత్తులో జరగబోయే మ్యాచ్‌లనైనా సరిగ్గా జరిగేలా మున్ముందు సమీక్షించాలని హాకీ ఇండియా కోరింది.