మార్చి నాటికి బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు: కేంద్రమంత్రి పెమ్మసాని
- గుంటూరు జిల్లాలో పర్యటించిన కేంద్ర సహాయమంత్రి పెమ్మసాని
- తాడికొండలో బేస్ బ్యాండ్ యూనిట్ ప్రారంభం
- 4,500 టవర్ల ద్వారా నాణ్యమైన 4జీ సేవలు అందిస్తామని వెల్లడి
కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నేడు గుంటూరు జిల్లాలో పర్యటించారు. తాడికొండలో ఏర్పాటు చేసిన దేశీయ బేస్ బ్యాండ్ యూనిట్ ను స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ, వచ్చే ఏడాది మార్చి నాటికి బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు అందరికీ అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. 4,500 టవర్ల ద్వారా నాణ్యమైన 4జీ సేవలు అందుబాటులోకి వస్తాయని వివరించారు.
అతి తక్కువ ధరలకే 4జీ సేవలు అందించేందుకు కేంద్రం ప్రణాళికలు రూపొందిస్తోందని పెమ్మసాని పేర్కొన్నారు. ప్రైవేటు టెలికామ్ సంస్థలు ధరలు పెంచడం వల్ల అందరూ బీఎస్ఎన్ఎల్ వైపు చూస్తున్నారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలకు కూడా ఇంటర్నెట్ సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం అని తెలిపారు.