పారిస్ ఒలింపిక్స్: సెమీఫైనల్లోకి దూసుకెళ్లిన భారత హాకీ జట్టు
- పారిస్ ఒలింపిక్స్ హాకీ ఈవెంట్ లో అదరగొట్టిన భారత్
- బ్రిటన్ పై షూటౌట్ లో విజయం
- నిర్ణీత సమయానికి స్కోరు 1-1తో సమం
- షూటౌట్లో 4-2తో నెగ్గిన భారత్
పారిస్ ఒలింపిక్స్ హాకీలో భారత పురుషుల జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఇవాళ జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో భారత్... బ్రిటన్ జట్టును ఓడించింది. ఈ మ్యాచ్ లో నిర్ణీత సమయానికి స్కోరు 1-1తో సమం కావడంతో విజేతను తేల్చేందుకు పెనాల్టీ షూటౌట్ నిర్వహించారు. పెనాల్టీ షూటౌట్ లో భారత్ 4-2తో విజయం సాధించి సెమీస్ లో ప్రవేశించింది.
ఎప్పట్లాగానే ఈ మ్యాచ్ లోనూ భారత గోల్ కీపర్ శ్రీజేశ్ ప్రత్యర్థి జట్టు దాడులకు అడ్డుగోడలా నిలిచాడు. ముఖ్యంగా పెనాల్టీ షూటౌట్ లో బ్రిటన్ ఆశలపై నీళ్లు చల్లాడు. అంతకుముందు నిర్ణీత సమయంలో భారత్ తరఫున కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్, బ్రిటన్ తరఫున లీ మోర్టన్ గోల్ చేశారు. ఫామ్ లో ఉన్న హర్మన్ ప్రీత్ సింగ్ కు పారిస్ ఒలింపిక్స్ లో ఇది ఏడో గోల్.
ఇక పెనాల్టీ షూటౌట్ లో భారత్ తరఫున కెప్టెన్ హర్మన్ ప్రీత్, సుఖ్ జీత్, లలిత్, రాజ్ కుమార్ గోల్ సాధించారు. బ్రిటన్ జట్టులో జేమ్స్ అల్బరీ, వాలెస్ స్కోర్ చేశారు.