యామినీ కృష్ణమూర్తి ప్రావీణ్యం, అంకితభావం తరతరాలకు స్ఫూర్తిదాయకం: ప్రధాని నరేంద్ర మోదీ
- నిన్న ఢిల్లీలో కన్నుమూసిన ప్రఖ్యాత నాట్యకారిణి యామినీ కృష్ణమూర్తి
- ఆమె ఇక లేరన్న వార్త తెలిసి ఎంతో బాధపడ్డానన్న ప్రధాని మోదీ
- దేశ సాంస్కృతిక యవనికపై చెరగని ముద్రవేశారని వెల్లడి
దేశం గర్వించదగ్గ నాట్య కళాకారిణి యామినీ కృష్ణమూర్తి నిన్న సాయంత్రం ఢిల్లీలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆమె మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. డాక్టర్ యామినీ కృష్ణమూర్తి తుదిశ్వాస విడిచారన్న వార్త తెలిసి ఎంతో బాధపడ్డానని వెల్లడించారు.
భారత శాస్త్రీయ నృత్యంలో ఆమె ప్రావీణ్యం, కళపై ఆమెకున్న అంకితభావం తరతరాలకు స్ఫూర్తిదాయకం అని కీర్తించారు. దేశ సాంస్కృతిక యవనికపై చెరగని ముద్ర వేశారని కొనియాడారు. మన ఘనతర వారసత్వాన్ని మరింత సుసంపన్నం చేయడానికి అవిరళ కృషి చేశారని మోదీ వివరించారు. ఆమె కుటుంబానికి, అభిమానులకు సంతాపం తెలియజేసుకుంటున్నానని పేర్కొన్నారు.