పంచాయితీలు ఎక్కువ... అందుకే అలాంటి సినిమాలు తీయను: రాంగోపాల్‌వర్మ

  • భక్తి చిత్రాలపై రాంగోపాల్ వర్మ తాజా కామెంట్స్
  • ప్రస్తుతం అలాంటి సినిమాలను భక్తితో చూస్తున్నారన్న వర్మ
  • అప్పట్లో ఎన్టీఆర్ సినిమాలు చేస్తే అందరూ చూసేవారని వ్యాఖ్య
  • ఇప్పుడు ఇలాంటి సినిమాలు తీస్తే అనవసర విమర్శలు, రచ్చ తప్ప ఇంకేం ఉండదని అభిప్రాయం
  • ‘రామాయణం’ సినిమాకు ఆల్ ద బెస్ట్ చెప్పిన దర్శకుడు
ప్రస్తుత కాలంలో పురాణాల ఆధారంగా సినిమాలు చేయడం అంత సులభం కాదని ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ అభిప్రాయపడ్డారు. బాలీవుడ్‌లో రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి కలిసి నటిస్తున్న ‘రామాయణం’ సినిమాను ఉద్దేశించి మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. దివంగత ఎన్టీఆర్ హయాంలో ఇలాంటి సినిమాలను అందరూ చూసేవారని చెప్పారు. ఇప్పుడు అలాంటి సినిమాలను భక్తితో చూస్తున్నారు తప్పితే ఆసక్తిగా ఎవరూ చూడడం లేదన్నారు.

భక్తి సినిమాల వల్ల ఇంకో తలనొప్పి కూడా ఉందని, ఏమాత్రం కొంచెం తప్పుగా అనిపించినా మతపెద్దలు సినిమాను అడ్డుకుంటారని పేర్కొన్నారు. సినిమా తీశాక అది హిట్ అవుతుందా? ఫ్లాప్ అవుతుందా? అన్న విషయాన్ని పక్కనపెడితే తానైతే ఇలాంటి సినిమాలను ఎప్పటికీ తీయబోనని తేల్చి చెప్పారు. లేనిపోయిన పంచాయితీలు, విభేదాలు, విమర్శలు తప్ప ఇంకేమీ ఉండవని వర్మ అభిప్రాయపడ్డారు.  రామాయణం లాంటి సినిమా చేసేందుకు ధైర్యం చేయడం మామూలు విషయం కాదని, అందుకనే వారికి ఆల్ ద బెస్ట్ చెబుతున్నానని వర్మ పేర్కొన్నారు.


More Telugu News