చిన్నప్పుడే ఆత్మీయులను కోల్పోతే వేగంగా వృద్ధాప్యం!
- కొలంబియా యూనివర్సిటీ పరిశోధనలో వెల్లడి
- ఆత్మీయులను కోల్పోవడానికి, వృద్ధాప్యం వేగవంతం కావడానికి మధ్య సంబంధం ఉన్నట్టు గుర్తింపు
- చిన్నతనంలోనే ఆత్మీయులను కోల్పోయిన వారిలో మానసిక, అనారోగ్య సమస్యలు వస్తాయన్న అధ్యయనం
ఆత్మీయులను కోల్పోయిన వారు వేగంగా వృద్ధులు అవుతున్నట్టు కొలంబియా యూనివర్సిటీ పరిశోధనలో తేలింది. తల్లిదండ్రులు, భార్య, భర్త, తోబుట్టువులు, పిల్లలను కోల్పోయిన వారు, అటువంటి ఘటనలు ఎదుర్కోని వారి మధ్య వృద్ధాప్యం ఏ విధంగా వస్తుందన్న విషయాన్ని అధ్యయనం చేశారు. ఈ క్రమంలో ఆత్మీయులను కోల్పోయినవారు వేగంగా వృద్ధులు అవుతున్నట్టు గుర్తించారు. బాల్యం నుంచి పెద్దలు అయ్యే వరకు ఆత్మీయులను కోల్పోవడానికి, జీవ సంబంధిత వృద్ధాప్యం వేగవంతం కావడానికి మధ్య బలమైన సంబంధం ఉన్నట్టు పరిశోధనలో వెల్లడైంది.
ఆత్మీయులను కోల్పోవడానికి, జీవితాంతం ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవడానికి మధ్య సంబంధం ఉందని పరిశోధకులు తేల్చారు. ఎక్కువమంది ఆత్మీయులను కోల్పోయిన వారిలో వృద్ధాప్యం వేగంగా వచ్చినట్టు గుర్తించారు. చిన్నప్పుడే తల్లిదండ్రులను, తోబుట్టువులను కోల్పోయిన వారు ఆ బాధను జీవితాంతం అనుభవిస్తారని, ఇది మానసిక సమస్యలు, గుండె సంబంధిత వ్యాధులు, అకాల మరణాలకు దారితీసే అవకాశం ఉందని అధ్యయనం వివరించింది. బాల్యం, కౌమార దశల్లో ఇలాంటి ఘటనలు జరిగితే ఆ ప్రభావం తీవ్రంగా ఉంటుందని తెలిపింది.