ఆర్కే బీచ్‌లో 'హ్యాండ్లూమ్ శారీ వాక్'ను ప్రారంభించిన వంగలపూడి అనిత
- ది స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సొసైటీ ఆధ్వర్యంలో కార్యక్రమం
- ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన 1000 మీటర్ల చేనేత చీర
- చీరకట్టులో వాక్ చేసిన మహిళలు
ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత విశాఖలో 'హ్యాండ్లూమ్ శారీ వాక్'ను ప్రారంభించారు. ది స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సొసైటీ ఆధ్వర్యంలో ఆర్కే బీచ్‌లో దీనిని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో 1000 మీటర్ల చేనేత చీర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మహిళలు చీరకట్టులో వాక్ చేసి అలరించారు.
ఈ వాక్‌ను ప్రారంభించిన అనంతరం అనిత మాట్లాడుతూ... భారతదేశం అంటేనే ప్రపంచమంతా గుర్తుకు వచ్చేది చీరకట్టు అన్నారు. ఇందులో చేనేత చీరలకు ప్రత్యేకమైన గుర్తింపు ఉందన్నారు. చీరలో అమ్మతనం ఉట్టిపడుతుందని, భావితరాలు ఈ సంప్రదాయాన్ని కొనసాగించాలన్నారు.
ప్రస్తుతం చేనేత రంగం సంక్షోభంలో ఉందని, ఎన్డీయే ప్రభుత్వం తరఫున చేనేత కార్మికులకు అండగా నిలబడతామని హామీ ఇచ్చారు. చేనేత కార్మికులు ఇప్పటికీ చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చీర నేయడానికి ఎంతో కష్టపడాలన్నారు. సమయం కూడా తీసుకుంటుందన్నారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో చేనేత కార్మికులకు అన్ని పథకాలు అమలయ్యేలా చూస్తామని, చేనేత కార్మికుల సంక్షేమానికి పాటుపడతామన్నారు.