ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో ఉత్తమచిత్రంగా నిలిచిన ‘బలగం’

  • ఉత్తమ దర్శకుడిగా నిలిచిన వేణు (బలగం)
  • దసరా సినిమాకు ఉత్తమ నటీనటులుగా ఎంపికైన నేచురల్ స్టార్ నానీ, కీర్తి సురేశ్
  • ఉత్తమ సహయ నటుడు కేటగిరిలో విజేతలుగా నిలిచిన బ్రహ్మానందం (రంగ మార్తాండ), రవి తేజ (వాల్తేరు వీరయ్య) 
శనివారం రాత్రి హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ వేదికగా 69వ శోభ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌ సౌత్ -2024 కార్యక్రమం సందడిగా జరిగింది. హీరోలు, హీరోయిన్ల సమక్షంలో విజేతలను ప్రకటించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమా ఇండస్ట్రీలకు చెందిన నటీనటులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

పెద్దగా అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలై అందరి ప్రశంసలు అందుకున్న ‘బలగం’ సినిమా ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన వేణు ఉత్తమ దర్శకుడిగా ఎంపికయ్యాడు. అంచనాలు అందుకోలేకపోయిన ‘దసరా’ సినిమాలో అద్భుతంగా నటించిన నేచురల్ స్టార్ నాని ఉత్తమ నటుడిగా, కీర్తి సురేశ్ ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. 

విజేతల పూర్తి జాబితా ఇదే..
1. ఉత్తమ సినిమా - బలగం
2. ఉత్తమ డైరెక్టర్ - వేణు యెల్దండి (బలగం)
3. ఉత్తమ సినిమా (క్రిటిక్స్) -సాయి రాజేష్ (బేబీ)
4. ఉత్తమ నటుడు (ప్రధాన పాత్ర) - నాని (దసరా)
5. ఉత్తమ నటుడు (క్రిటిక్స్) - ప్రకాశ్ రాజ్ (రంగ మార్తాండ), నవీన్ పోలిశెట్టి (మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి)
6. ఉత్తమ నటి (ప్రధాన పాత్ర) - కీర్తి సురేశ్ (దసరా)
7. ఉత్తమ నటి (క్రిటిక్స్)- వైష్ణవి చైతన్య (బేబీ)
8. ఉత్తమ సహయ నటుడు (మేల్) - బ్రహ్మానందం (రంగ మార్తాండ), రవి తేజ (వాల్తేరు వీరయ్య)
9. ఉత్తమ సహయ నటి - రూపా లక్ష్మి (బలగం)
10. బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్ - బేబీ (విజయ్ బుల్గానిన్)
11. ఉత్తమ లిరిక్స్ - అనంత శ్రీరామ్ (ఓ రెండు ప్రేమ మేఘాలిలా- బేబీ)
12. ఉత్తమ నేపథ్య గాయకుడు - శ్రీరామ చంద్ర (ఓ రెండు ప్రేమ మేఘాలిలా- బేబీ)
13. ఉత్తమ నేపథ్య గాయని - శ్వేతా మోహన్ (మాస్టారు మాస్టారు - సర్)
14. ఉత్తమ సినిమాటోగ్రఫీ- సత్యన్ సూర్యన్ (దసరా)
15. ఉత్తమ కొరియోగ్రఫీ- ప్రేమ్ రక్షిత్ (ధూమ్ ధామ్ దోస్తాన్- దసరా)
16. బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ - కొల్లా అవినాశ్ (దసరా)
16. ఉత్తమ పరిచయ దర్శకుడు (డెబ్యూ) - శ్రీకాంత్ ఓదెల (దసరా), శౌర్యవ్ (హాయ్ నాన్న).
17. ఉత్తమ పరిచయ నటుడు - సంగీత్ శోభన్ (మ్యాడ్)


More Telugu News