యామినీ కృష్ణమూర్తి మృతిపై సీఎం చంద్రబాబు స్పందన
- ఢిల్లీలో కన్నుమూసిన ప్రముఖ నృత్యకారిణి యామినీ కృష్ణమూర్తి
- తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు
- నాట్య రంగంలో ఆమె లేని లోటు తీర్చలేనిదని వెల్లడి
ప్రఖ్యాత నృత్య కళాకారిణి యామినీ కృష్ణమూర్తి (84) మృతి పట్ల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. భారతదేశం గర్వించదగిన నృత్యకారిణి, పద్మవిభూషణ్ యామినీ కృష్ణమూర్తి ఢిల్లీ అపోలో ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారని తెలిసి తీవ్రమైన ఆవేదన చెందానని వెల్లడించారు. 1940లో మదనపల్లెలో జన్మించిన ఆమె తిరుమల తిరుపతి దేవస్థానాల ఆస్థాన నర్తకిగా పని చేశారని చంద్రబాబు వివరించారు.
"భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ నృత్యాలలో ఆమె నిష్ణాతురాలు. కూచిపూడి నృత్యానికి దేశవిదేశాలలో ఎనలేని పేరు తెచ్చిపెట్టింది కూడా యామినీ కృష్ణమూర్తి గారే. ఆమె లేని లోటు నృత్య కళా రంగంలో ఎవరూ తీర్చలేరు. ఆమె ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను" అంటూ సోషల్ మీడియాలో ఓ ప్రకటన చేశారు.