కోల్‌కతా విమానాశ్రయాన్ని ముంచెత్తిన వరద నీరు... ఇదిగో వీడియో!
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాను భారీ వర్షం ముంచెత్తింది. కోల్‌కతా సహా దాని పరిసర ప్రాంతాల్లో గురు, శుక్ర వారాల్లో కుండపోత వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులు నదులను తలపిస్తున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
ఇక భారీ వర్షానికి కోల్ కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం కూడా నీట మునిగింది. ఎయిర్‌పోర్ట్ రన్‌వేపైకి భారీగా వరద నీరు చేరింది. విమానాల పార్కింగ్ జోన్ మొత్తం నీటితో నిండిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. రానున్న రోజుల్లో కోల్‌కతా నగర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.