కేరళకు భారీ సాయం ప్రకటించిన కర్ణాటక
- వాయనాడ్ బాధితులకు 100 ఇళ్లు నిర్మించిస్తామన్న సీఎం సిద్ధరామయ్య
- 'ఎక్స్' వేదికగా ప్రకటన
- ఇప్పటికే పలువురు ప్రముఖులు కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు
కేరళ రాష్ట్రం వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటన యావత్తు దేశాన్ని కలిచివేసింది. ఈ ఘటనలో ఇప్పటి వరకూ 358 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ కష్టకాలంలో బాధితులను ఆదుకునేందుకు పలువురు ప్రముఖులు తమ వంతు సాయం అందిస్తున్నారు. ఇప్పటికే పలువురు సినీ తారలు, రాజకీయ నేతలు కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు అందించిన విషయం తెలిసిందే.
తాజాగా కర్ణాటక ప్రభుత్వం కూడా కేరళ రాష్ట్రానికి ఆపన్న హస్తం అందించింది. కొండచరియలు విరిగిపడిన ఘటనలో బాధితులకు 100 ఇళ్లు నిర్మించి ఇస్తామని ప్రకటించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా వెల్లడించారు. విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్న కేరళకు తమ మద్దతు ఉంటుందని తెలిపారు.
"మా మద్దతు ఉంటుందని నేను కేరళ సీఎం పినరయి విజయన్‌కు హామీ ఇచ్చాను. కర్ణాటక బాధితులకు మా ప్రభుత్వం 100 ఇళ్లను నిర్మించి ఇస్తుంది. కలిసి మేము పునర్నిర్మిస్తాము, ఆశలను పునరుద్ధరిస్తాము" అని సిద్ధరామయ్య ట్వీట్ చేశారు.
కాగా, జులై 30 తెల్లవారుజామున వాయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడటంతో 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 500 మందికి పైగా గాయపడ్డారు. ఈ విపత్తు తర్వాత 300 మంది ఆచూకీ లేకుండా పోయారు. విధ్వంసం మధ్య రెస్క్యూ సిబ్బంది అవిశ్రాంతంగా పనిచేస్తోంది. ధ్వంసమైన ఇళ్లు, భవనాల శిథిలాల గుండా బృందాలు బాధితుల కోసం వెతుకుతున్నాయి.