లెఫ్టినెంట్ హోదాలో 'వాయనాడ్' సహాయక చర్యల్లో పాల్గొన్న మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్
కేరళలోని వాయనాడ్ లో సంభవించిన ప్రకృతి విపత్తు అన్ని వర్గాల వారిని కదిలించింది. వాయనాడ్ లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో దాదాపు 300 మందికి పైగా మృత్యువాతపడ్డారు. ఇప్పటికీ అక్కడ సహాయకచర్యలు కొనసాగుతున్నాయి.
కాగా, ప్రాదేశిక సైన్యం (టెరిటోరియల్ ఆర్మీ)లో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్న మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కూడా సహాయక చర్యల్లో పాలుపంచుకున్నారు.
వాయనాడ్ లోని టెరిటోరియల్ ఆర్మీ క్యాంపును సందర్శించిన మోహన్ లాల్... సహాయకచర్యలు చేపడుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. సైనిక దుస్తుల్లో ఉన్న ఆయన తనవంతుగా సేవలు అందించారు. మోహన్ లాల్ ఇప్పటికే వాయనాడ్ బాధితుల పునరావాసం కోసం విశ్వశాంతి ఫౌండేషన్ కు రూ.3 కోట్ల భారీ విరాళం అందించారు.