గన్ పార్క్ వద్ద కేటీఆర్, హరీశ్ రావు సహా బీఆర్ఎస్ నేతల అరెస్ట్

  • అసెంబ్లీ సాక్షిగా జాబ్ క్యాలెండర్ పేరిట నిరుద్యోగులను మోసం చేశారని విమర్శ
  • గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన
  • నిరసన తెలిపే హక్కు లేదా? ప్రజాపాలన అంటే ఇదేనా? అంటూ నిలదీత
హైదరాబాదులోని గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు సహా పలువురిని అరెస్ట్ చేశారు. జాబ్ క్యాలెండర్ పేరిట అసెంబ్లీ సాక్షిగా నిరుద్యోగులను మోసం చేస్తున్నారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శుక్రవారం సాయంత్రం గన్ పార్క్ వద్ద ఆందోళనకు దిగారు.

ఈ సమయంలో పోలీసులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసి బస్సుల్లో తరలించారు. అమరవీరుల స్తూపం వద్ద నిరసన తెలిపే హక్కు లేదా? ఇదేనా ప్రజాపాలన? అని ఎమ్మెల్యేలు ప్రశ్నించారు.

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి... రెండు ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని విమర్శించారు. రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చి ఇక్కడి యువతకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చే వరకు కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని వెంటాడుతామన్నారు. నిరుద్యోగులకు న్యాయం జరిగేదాకా వారికి అండగా నిలుస్తామన్నారు.


More Telugu News