పారిస్ ఒలింపిక్స్: మూడో పతకానికి చేరువలో మను భాకర్

  • పారిస్ ఒలింపిక్స్ లో ఇప్పటికే రెండు పతకాలు సాధించిన మను భాకర్
  • నేడు 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ అంశంలో ఫైనల్ చేరిన యువ షూటర్
  • ఇప్పటికే షూటింగ్ లో రెండు పతకాల కైవసం
భారత యువ మహిళా షూటర్ మను భాకర్ పారిస్ ఒలింపిక్స్ లో సత్తా చాటుతోంది. ఇప్పటికే రెండు కాంస్య పతకాలు సాధించి చరిత్ర సృష్టించిన ఈ హర్యానా అమ్మాయి తాజాగా మూడో పతకంపై కన్నేసింది. పారిస్ ఒలింపిక్స్ లో ఇవాళ మహిళల 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ అంశంలో మను భాకర్ ఫైనల్ చేరింది. 

22 ఏళ్ల మను భాకర్ ఇవాళ జరిగిన క్వాలిఫికేషన్ రౌండ్ లో మెరుగైన ప్రతిభ కనబర్చి మూడో స్థానంలో నిలిచింది. తద్వారా ఫైనల్ రౌండ్ కు అర్హత సాధించింది. 

మను భాకర్ ఇప్పటికే 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత, టీమ్ ఈవెంట్లలో కాంస్య పతకాలు సాధించింది. ఇప్పుడు మూడో పతకం కూడా సాధిస్తే ఆమె పేరు భారత ఒలింపిక్ చరిత్రలో నిలిచిపోనుంది.


More Telugu News