మంత్రి నారా లోకేశ్ ను అభినందించిన బీజేపీ నేత జీవీఎల్... ఎందుకంటే...!
- నిన్న చంద్రబాబు పర్యటన వేళ మడకశిరలో సీపీఎం నేతల అరెస్ట్
- పోలీసుల తీరు ఇంకా మారలేదన్న నారా లోకేశ్
- సీపీఎం నేతలకు క్షమాపణ తెలుపుతూ ప్రకటన విడుదల
- నారా లోకేశ్ చర్య పట్ల జీవీఎల్ స్పందన
బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు ఏపీ మంత్రి నారా లోకేశ్ ను అభినందించారు. అందుకు కారణం ఉంది. నిన్న సీఎం చంద్రబాబు మడకశిర పర్యటన సందర్భంగా పోలీసులు సీపీఎం నేతలను ముందస్తు అరెస్టులు చేశారు.
దీనిపై నారా లోకేశ్ స్వయంగా సీపీఎం నేతలకు క్షమాపణలు తెలిపారు. పోలీసుల తీరు ఇంకా మారలేదని, ఇలాంటివి పునరావృతం కానివ్వబోమని స్పష్టం చేశారు. ఈ మేరకు లోకేశ్ ఓ క్షమాపణ ప్రకటన విడుదల చేశారు. దీనిపై జీవీఎల్ నరసింహారావు స్పందించారు.
"నారా లోకేశ్ గారూ... మీ శాఖలో జరిగిన తప్పు కాకపోయినా, పోలీసుల మితిమీరిన చర్యలకు ఈ సందేశంతో క్షమాపణ చెప్పారు. అలాగే, మీ విద్యాశాఖలో అనేక ప్రభుత్వ పథకాలకు తెలుగు ప్రముఖుల పేర్లు పెట్టి రాజకీయాల్లో మంచి సంప్రదాయాలకు తెరదీశారు. అందుకు అభినందనలు తెలుపుతున్నాను" అంటూ జీవీఎల్ ట్వీట్ చేశారు.