భార‌త్‌తో తొలి వ‌న్డే... టాస్ గెలిచిన శ్రీలంక‌!

  • కొలంబో వేదిక‌గా భార‌త్‌, శ్రీలంక మధ్య‌ తొలి వ‌న్డే
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆతిథ్య జ‌ట్టు 
  • 2019 త‌ర్వాత తొలిసారి వ‌న్డే ఆడుతున్న శివం దూబే
కొలంబో వేదిక‌గా భార‌త్‌, శ్రీలంక మధ్య‌ జ‌రుగుతున్న తొలి వ‌న్డేలో టాస్ గెలిచిన ఆతిథ్య జ‌ట్టు మొద‌ట బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్ప‌టికే మూడు టీ20ల సిరీస్ ను క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా.. వ‌న్డే సిరీస్‌లోనూ అద‌ర‌గొట్టాల‌ని బ‌రిలోకి దిగుతోంది. ఇటీవ‌ల జ‌రిగిన టీ20 ప్ర‌పంచ‌క‌ప్ త‌ర్వాత ఈ ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పిన భార‌త స్టార్ ప్లేయ‌ర్లు రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ తిరిగి ఈ సిరీస్ ద్వారా బ‌రిలోకి దిగుతున్నారు. అటు 2019 త‌ర్వాత శివం దూబే తొలిసారి వ‌న్డే ఆడుతున్నాడు. 

భార‌త జ‌ట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీప‌ర్‌), వాషింగ్టన్ సుందర్, శివం దూబే, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్.
 
శ్రీలంక జ‌ట్టు: పతుమ్ నిస్సాంక, అవిష్క ఫెర్నాండో, కుశాల్ మెండిస్ (వికెట్ కీప‌ర్‌), సదీర సమరవిక్రమ, చరిత అసలంక (కెప్టెన్), జనిత్ లియానాగే, వనిందు హసరంగ, దునిత్ వెల్లలాగే, అఖిల ధనంజయ, అసిత ఫెర్నాండో, మహ్మద్ షిరాజ్.


More Telugu News