ఆమె నా ప్రాణాలు కాపాడింది.. థ్యాంక్స్: డొనాల్డ్ ట్రంప్
- నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు
- డొమొక్రటిక్, రిపబ్లికన్ పార్టీల ముమ్మర ప్రచారం
- తనపై దాడి ఘటనపై మరోసారి స్పందించిన మాజీ అధ్యక్షుడు
- ఓ మహిళ వల్లే తాను ప్రాణాలతో బయటపడ్డానని వెల్లడి
నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. దాంతో ప్రధాన పార్టీలైన డొమొక్రటిక్, రిపబ్లికన్ పార్టీలు ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. అధ్యక్ష అభ్యర్థులు కమలా హ్యారీస్, డొనాల్డ్ ట్రంప్ వరుస ర్యాలీలలో పాల్గొంటున్నారు. అయితే, ఇటీవల మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఓ దుండగుడు కాల్పులకు పాల్పడడం కలకలం రేపింది. పెన్సిల్వేనియాలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ట్రంప్‌పై ఉన్నట్టుండి దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఆయన చెవికి స్వల్ప గాయమయింది. దీంతో త్రుటిలో మాజీ అధ్యక్షుడు ప్రాణాలతో బయటపడ్డారు.
తాజాగా ఈ ఘటనపై ట్రంప్ మరోసారి స్పందించారు. ఓ మహిళ వల్లే తాను ప్రాణాలతో బయటపడ్డానని తెలిపారు. ఆ మహిళను ప్రత్యేకంగా వేదికపైకి పిలిచి థ్యాంక్స్ చెప్పారు. పెన్సిల్వేనియా సభలో మాట్లాడుతుండగా కంప్యూటర్ సెక్షన్ సిబ్బందిలోని ఓ యువతి వలసదారుల చార్ట్ ను స్క్రీన్ పై ప్రదర్శించారు. దాన్ని చూసేందుకు తలను తిప్పడంతో బుల్లెట్ మిస్సయ్యిందని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆ మహిళను వేదికపైకి పిలిచి ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని, ధన్యవాదాలు తెలియజేశారు.