సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌పై అత్యాచారం... అసిస్టెంట్ డైరెక్టర్ అరెస్ట్
- షార్ట్ ఫిలిమ్స్ డైరెక్ట్ చేస్తున్న సిద్ధార్థ్ వర్మ
- సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేసే యువతితో పరిచయం
- సినిమాల్లో ఛాన్స్ ఇప్పిస్తానని ఇంటికి రప్పించుకొని అఘాయిత్యం
- నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన పోలీసులు
హైదరాబాద్‌లో ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌పై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో అసిస్టెంట్ డైరెక్టర్ సిద్ధార్థ్ వర్మను పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిని గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసుకు సంబంధించి గచ్చిబౌలి సీఐ మాట్లాడుతూ... కొండాపూర్ రాఘవేంద్ర కాలనీలో నివాసం ఉంటున్న సిద్దార్థ్ వర్మ పలు షార్ట్ ఫిలిమ్స్‌కు డైరెక్టర్‌గా వ్యవహరించాడు. సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నాడు.
కొన్నిరోజుల క్రితం పుప్పాలగూడలో ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పని చేస్తున్న యువతిని పరిచయం చేసుకున్నాడు. తనకు తెలిసిన యువతి ద్వారా ఆమెను పరిచయం చేసుకున్నాడు. సినిమాలలో ఛాన్స్ ఇప్పిస్తానని నమ్మబలికాడు. బుధవారం తన ఇంటికి పిలిపించుకొని... కూల్ డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఇచ్చి, ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. యువతి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి, అతనిని అరెస్ట్ చేశారు.