రేవంత్ రెడ్డీ! ఆ రోజు నా వెనుకే ఉన్నావ్.. నిక్కి నిక్కి చూశావ్!: వీడియో పోస్ట్ చేసిన హరీశ్ రావు
- తనకు మంత్రి పదవి ఎవరి భిక్ష కాదన్న హరీశ్ రావు
- పదవి వచ్చినప్పుడు రేవంత్ బీఆర్ఎస్‌లో ఉన్నారని.. ఊరేగింపులోనూ ఉన్నారన్న హరీశ్ రావు
- సోనియా కోరిక మేరకే తాము యూపీఏలో చేరామన్న హరీశ్ రావు
తనకు సోనియా గాంధీ మంత్రి పదవి ఇచ్చిందన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు మంత్రి పదవి ఎవరి భిక్ష వల్లనో రాలేదన్నారు. అయినా తనకు మంత్రి పదవి వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ (నాడు టీఆర్ఎస్) లోనే ఉన్నారని, తన ఊరేగింపులో కూడా ఉన్నారని తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ తాను మంత్రి పదవికి రాజీనామా చేసినప్పుడు కూడా నా వెనకే ఉన్నావ్, నిక్కి నిక్కి చూశావ్ అంటూ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చురక అంటించారు. ఇదంతా నీ కళ్ల ముందు జరిగిందే... కానీ ఇవేమి తెలియనట్లు చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నావని మండిపడ్డారు. ఆ రోజు సోనియా గాంధీ కోరిక మేరకే తాము నాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో చేరాము తప్పితే పదవుల కోసం కాదన్నారు.
పదవులు, విలువల గురించి మాట్లాడే హక్కు నీకెక్కడిదని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమంలో పదవులను గడ్డి పోచలుగా త్యజించిన చరిత్ర బీఆర్ఎస్‌దే అన్నారు. కానీ పూటకో పార్టీ మారిన రాజకీయ చరిత్ర నీదేనని, పదవుల కోసం పెదవులు మూసుకున్న చరిత్ర నీదని ముఖ్యమంత్రిని ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. సీఎం అయినప్పటికీ హుందాగా ప్రవర్తించడం లేదన్నారు. చీఫ్ మినిస్టర్‌గా కాకుండా, చిల్లరగా మాట్లాడే చీప్ మినిస్టర్‌గా వ్యవహరిస్తున్నావన్నారు.