జులై మాసం జీఎస్టీ వసూళ్లు రూ.1.82 లక్షల కోట్లు

  • ఏడాది ప్రాతిపదికన 10.3 శాతం పెరుగుదల
  • జూన్ నెలలో తగ్గిన జీఎస్టీ వసూళ్లు
  • ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోరూ.6.56 లక్షల కోట్లకు చేరిన వసూళ్లు
జులైలో జీఎస్టీ వసూళ్లు భారీగా పెరిగాయి. ఆగస్ట్ 1న విడుదల చేసిన గణాంకాల ప్రకారం... గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే 10.3 శాతం పెరిగి రూ.1.82 లక్షల కోట్లకు చేరుకున్నాయి. జూన్ నెలలో మాత్రం వసూళ్లు (రూ.1.74 లక్షల కోట్లు) తగ్గాయి. కరోనా తర్వాత మొదటిసారి వసూళ్లు 10 శాతం వరకు పడిపోయాయి. కానీ ఈ జులైలో వసూళ్లు పుంజుకున్నాయి.

అయితే, ఈ ఏడాది ఏప్రిల్ నెల కంటే జులై మాసం జీఎస్టీ వసూళ్లు తక్కువగా ఉన్నాయి. ఏప్రిల్‌లో జీఎస్టీ వసూళ్లు 2.1 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు జీఎస్టీ వసూళ్లు రూ.6.56 లక్షల కోట్లుగా ఉన్నాయి.


More Telugu News