అందుకే భానుప్రియ రావడం మానేసింది: భానుచందర్
- ఆలోచన సుహాసినిదేనని చెప్పిన భానుచందర్
- తమకి వాట్సాప్ గ్రూప్ ఉందని వెల్లడి
- డైలీ చాట్ చేసుకుంటామని వివరణ
- అర్చన అందుబాటులో లేదని స్పష్టీకరణ
1980లలో కలిసి పని చేసిన హీరోలు .. హీరోయిన్స్ లో కొంతమంది కలిసి '80s రీ యూనియన్' గ్రూప్ పెట్టుకున్నారు. ప్రతి ఏడాది ఈ హీరోలు .. హీరోయిన్స్ అంతా సరదాగా కలుసుకుంటూ ఉంటారు. అందుకు సంబంధించి ఫొటోలు కూడా సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటాయి. అందుకు సంబంధించిన ప్రశ్న, తాజాగా ఐ డ్రీమ్ వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో భానుచందర్ కి ఎదురైంది.
అందుకు భానుచందర్ స్పందిస్తూ .. "ఇలా అందరం కలుసుకోవాలనే ఒక ఆలోచన పూర్తిగా సుహాసిని .. లిజీకి వచ్చింది. వాళ్లకి ఆ ఆలోచన రాగానే మొదట నాకు కాల్ చేశారు. అప్పటి నుంచి అది ఆచరణలోకి వచ్చేసింది. అలా కలుసుకున్నప్పుడు పాత విషయాలన్నీ సరదాగా మాట్లాడుకుంటాము. అప్పట్లో లవ్ గురించిన ఆలోచనే మా మధ్య వచ్చేది కాదు .. మంచి స్నేహితులుగానే ఉండేవాళ్లం. అందువల్లనే ఇప్పటికీ కలుసుకోగలుగుతున్నాము" అని అన్నారు.
"కుటుంబ సంబంధమైన సమస్యల కారణంగా భానుప్రియ రావడం మానేసింది. ఇక సరితగారు ఇప్పటికీ టచ్ లోనే ఉన్నారు. రీ యూనియన్ పార్టీ సమయంలో రాకపోయినప్పటికీ, అందరికీ వాట్సాప్ గ్రూప్ ఉంది. అందులో ప్రతి రోజు చాట్ చేసుకుంటూనే ఉంటాము. అర్చన అందుబాటులో లేదు" అని చెప్పారు.