పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు మూడో కాంస్యం... ఇది కూడా షూటింగ్ లోనే!
- పురుషుల 50మీ ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో భారత్ కు పతకం
- మూడో స్థానంలో నిలిచిన స్నప్నిల్ కుశాలే
- ఇప్పటికే షూటింగ్ క్రీడాంశంలో రెండు కాంస్యాలు
- స్నప్నిల్ ను అభినందించిన ప్రధాని మోదీ
పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు మరో పతకం లభించింది. పురుషుల 50 మీటర్ల ఎయిర్ రైఫిల్ 3 పొజిషన్ విభాగంలో భారత షూటర్ స్వప్నిల్ కాంస్యం సాధించాడు. ఈ ఒలింపిక్స్ లో ఇది భారత్ కు మూడో కాంస్యం. ఇది కూడా షూటింగ్ క్రీడాంశంలోనే లభించడం విశేషం. మహిళల 10మీ ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత, టీమ్ ఈవెంట్లలో మను బాకర్ ఇప్పటికే రెండు కాంస్యాలు కైవసం చేసుకోవడం తెలిసిందే.
నేడు 8 మంది షూటర్లతో జరిగిన 50 మీటర్ల ఎయిర్ రైఫిల్ 3పీ ఫైనల్ ఈవెంట్ లో స్వప్నిల్ కుశాలే 451.4 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచాడు. 28 ఏళ్ల స్నప్నిల్ కు ఒలింపిక్స్ లో ఇదే తొలి పతకం.
పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు పతకం అందించిన స్వప్నిల్ ను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. ఈ విజయం ప్రతి భారతీయుడిలోనూ ఆనందాన్ని నింపిందని పేర్కొన్నారు.
కాగా, తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ బాక్సింగ్ ఈవెంట్ లో ఓటమిపాలైంది. మహిళల 50 కిలోల కేటగిరీలో నిఖత్ జరీన్... చైనా బాక్సర్ యు వూ చేతిలో పరాజయం చవిచూసింది.