శ్రీశైలం వద్ద కృష్ణా నదికి జలహారతి ఇచ్చిన సీఎం చంద్రబాబు
- శ్రీశైలం చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు
- మల్లన్న ఆలయంలో పూర్ణకుంభ స్వాగతం
- స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన చంద్రబాబు
- అనంతరం కృష్ణా నదికి శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీశైలం పర్యటనలో భాగంగా ప్రాజెక్టును సందర్శించారు. పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మకు జలహారతి పట్టారు. కృష్ణా నదికి శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
అంతకుముందు, శ్రీశైలంలో కొలువుదీరిన భ్రమరాంబికా మల్లికార్జునస్వామివారిని చంద్రబాబు దర్శించుకున్నారు. మల్లన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన ముఖ్యమంత్రికి అర్చకులు సంప్రదాయబద్ధంగా పూర్ణకుంభ స్వాగతం పలికారు. దర్శనం అనంతరం చంద్రబాబుకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
కృష్ణా నదికి జలహారతి ఇచ్చిన అనంతరం చంద్రబాబు సాగునీటి వినియోగదారులతో సమావేశం అయ్యారు.