ఢిల్లీ మెట్రో ప్రయాణికుడిపై చెప్పుతో దాడి.. వీడియో ఇదిగో!
- ఇద్దరు ప్రయాణికుల మధ్య గొడవ
- ఓ వ్యక్తి రెండో ప్రయాణికుడిని చెప్పుతో కొట్టిన వైనం
- నెట్టింట వీడియో వైరల్, విమర్శల వెల్లువ
- ఇలాంటి వాళ్లను మెట్రోల్లోకి అనుమతించొద్దంటూ డిమాండ్లు
ప్రయాణికుల తగాదాలకు కేరాఫ్‌గా మారిన ఢిల్లీ మెట్రోలో తాజాగా మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ ప్రయాణికుడు మరో వ్యక్తిని చెప్పుతో కొట్టాడు. వారి వివాదానికి గల కారణం తెలియరానప్పటికీ ఘటన తాలూకు వీడియో నెట్టింట ప్రకంపనలు సృష్టిస్తోంది.
తొలుత ఇద్దరు ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు. చూస్తుండగానే వివాదం ముదిరి అనూహ్య మలుపు తీసుకుంది. ఓ ప్రయాణికుడు అవతలి వ్యక్తిని ఏకంగా చెప్పుతో కొట్టాడు. దీంతో, క్షణకాలం షాకైపోయిన అతడు తనను చెప్పుతో కొట్టిన వ్యక్తి చెంఫ ఛెళ్లుమనిపించాడు. ఆ తరువాత అతడి నుంచి దూరంగా వెళుతుండగా ప్రయాణికుడు మళ్లీ చెప్పు పట్టుకుని అతడిని వెంబడించాడు. ఈలోపు, మరో వ్యక్తి జోక్యం చేసుకుని అతడిని అడ్డుకున్నాడు.
వీడియోపై జనాలు రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేశారు. చెప్పుతో కొట్టిన వ్యక్తిని అరెస్టు చేసి తీరాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సంస్కార రహితుల్ని మెట్రోల్లోకి అనుమతించకూడదని కొందరు అభిప్రాయపడ్డారు. మెట్రోలో అంతమంది ఉన్నా కేవలం ఒకే వ్యక్తి గొడవ ముదరకుండా అడ్డుకోవడం నెటిజన్లను ఆశ్చర్యపరిచింది. అక్కడున్న మిగతా వారికి సామాజిక స్పృహలేదంటూ దుమ్మెత్తిపోశారు. చెప్పుతో కొట్టిన వ్యక్తి మద్యం మత్తులో ఉండిఉండొచ్చని కొందరు అన్నారు. అవతలి వ్యక్తి చెప్పుతో కొట్టేందుకు సిద్ధమవుతున్నా దెబ్బపడే వరకూ రెండో ప్రయాణికుడు స్పందించకపోవడం ఏంటని మరికొందరు ఆశ్చర్యపోయారు.