మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి బెయిల్ నిరాకరించిన గుంటూరు జిల్లా కోర్టు
- ఎన్నికల వేళ సీఐ నారాయణస్వామిపై దాడి, టీడీపీ ఏజెంట్ పై హత్యాయత్నం
- పిన్నెల్లిపై రెండు కేసుల నమోదు
- నెల్లూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న పిన్నెల్లి
- పిన్నెల్లి బెయిల్ పిటిషన్లపై నేడు గుంటూరు జిల్లా కోర్టులో విచారణ
వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి న్యాయస్థానంలో మరోసారి చుక్కెదురైంది. గుంటూరు జిల్లా కోర్టు పిన్నెల్లికి బెయిల్ నిరాకరించింది. గతంలో సెషన్స్ కోర్టు పిన్నెల్లి బెయిల్ పిటిషన్ ను తోసిపుచ్చడం తెలిసిందే. ఇప్పుడు గుంటూరు డిస్ట్రిక్ట్ కోర్టులోనూ ఆయనకు నిరాశ తప్పలేదు.
ఎన్నికల సమయంలో కారంపూడి సీఐ నారాయణస్వామిపై దాడి, టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావుపై దాడి, హత్యాయత్నం చేశారన్న అభియోగాలతో పిన్నెల్లిపై కేసులు నమోదయ్యాయి. ఈ రెండు కేసుల్లో ఆయన రిమాండ్ ఖైదీగా నెల్లూరు జైలులో ఉన్నారు.
ఈ రెండు కేసుల్లోనూ బెయిల్ కోరుతూ, పిన్నెల్లి దాఖలు చేసిన పిటిషన్లపై నేడు గుంటూరు జిల్లా కోర్టు విచారణ చేపట్టింది. ఆ రెండు బెయిల్ పిటిషన్లను న్యాయమూర్తి కొట్టివేశారు.