రాజమౌళి అద్భుతమైన నటుడు... కానీ కెమెరా ముందుకు రాడు: జూనియర్ ఎన్టీఆర్
- రాజమౌళి దర్శక ప్రస్థానంపై డాక్యుమెంటరీ
- తన అభిప్రాయాలను పంచుకున్న జూనియర్ ఎన్టీఆర్
- రాజమౌళి కెమెరా ముందుకు వచ్చేందుకు ఆసక్తి చూపించడని వెల్లడి
టాలీవుడ్ అగ్రశ్రేణి దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళిపై టాప్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ తమ అభిప్రాయాలు పంచుకున్నారు. రాజమౌళి దర్శక ప్రస్థానంపై తాజాగా రూపొందించిన మోడ్రన్ మాస్టర్స్: ఎస్ఎస్ రాజమౌళి డాక్యుమెంటరీలో ప్రముఖులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ డాక్యు ఫిలింలో జక్కన్న గురించి పలు వ్యాఖ్యలు చేశారు.
రాజమౌళి అద్భుతమైన నటుడు అని జూనియర్ ఎన్టీఆర్ కొనియాడారు. చిత్రీకరణ సమయంలో నటీనటులకు సీన్లను వివరించేటప్పుడు రాజమౌళి చాలా గొప్పగా నటించి చూపిస్తారని వివరించారు. అయితే కెమెరా ముందుకు వచ్చి నటించడానికి మాత్రం జక్కన్న ఎప్పుడూ ఆసక్తి చూపించడని ఎన్టీఆర్ తెలిపారు.
ఓ సన్నివేశం గురించి తాము ఏమనుకుంటున్నారో దాన్ని కళ్లకు కట్టినట్టు వివరించగల అతి కొద్ది మంది దర్శకుల్లో రాజమౌళి ఒకరని అభివర్ణించారు. "రాజమౌళి చెబుతుంటే మీరు ఉద్విగ్నతకు గురవుతారు, మీరు చూపు కూడా తిప్పుకోలేరు, మీకు తెలియకుండానే ఆ సన్నివేశం తాలూకు భావాలు మీ ముఖంలో ప్రత్యక్షమవుతాయి... అంతగా మిమ్మల్ని సన్నివేశంలో లీనం చేస్తాడు" అని ఎన్టీఆర్ వివరించారు.