జీవనకాల గరిష్ఠాలకు చేరువలో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు

  • ఇవాళ ఆశాజనక రీతిలో ట్రేడింగ్
  • లాభాలతో కళకళలాడిన సెన్సెక్స్, నిఫ్టీ
  • జేఎస్ డబ్ల్యూ స్టీల్, ఏషియన్ పెయింట్స్, మారుతి సుజుకి షేర్లకు లాభాలు
  • నష్టాల బాటలో రిలయన్స్, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్ వంటి దిగ్గజాలు
భారత స్టాక్ మార్కెట్ నేడు లాభాలతో కళకళలాడింది. ట్రేడింగ్ ఆరంభం నుంచే ఆశాజనకంగా కొనసాగిన స్టాక్ మార్కెట్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ జీవనకాల గరిష్ఠాలకు చేరువలో ముగిశాయి. 

సెన్సెక్స్ 285 పాయింట్ల లాభంతో 81,741 వద్ద స్ధిరపడగా... నిఫ్టీ 93 పాయింట్ల లాభంతో 24,951 వద్ద ముగిసింది. సెన్సెక్స్ జీవనకాల గరిష్ఠం 81,908 కాగా... నిఫ్టీ జీవనకాల గరిష్ఠం 24,999. 

ఇవాళ్టి ట్రేడింగ్ లో జేఎస్ డబ్ల్యూ స్టీల్, ఏషియన్ పెయింట్స్, మారుతి సుజుకి, ఎన్టీపీసీ, భారతి ఎయిర్ టెల్, ఐటీసీ, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు లాభాల బాటలో పయనించాయి. రిలయన్స్, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్ షేర్లు నష్టపోయాయి. 

మొత్తమ్మీద ఆటోమొబైల్, ఐటీ, ఆర్థిక సేవల రంగం, ఫార్మా, ఎఫ్ఎంసీజీ, మెటల్ కంపెనీల షేర్లు లాభపడ్డాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు, రియల్ ఎస్టేట్ కంపెనీలకు నేడు ప్రతికూల పవనాలు వీచాయి.


More Telugu News