వెనిజులా అధ్యక్షుడు మదురో గురించి సమాచారం అందిస్తే రూ.125 కోట్ల రివార్డు

  • మూడోసారి వెనిజులా అధ్యక్షుడిగా ఎన్నికైన మదురో
  • మదురోపై తీవ్రస్థాయిలో అవినీతి, మాదకద్రవ్యాల అక్రమ రవాణా ఆరోపణలు
  • కళ్లు చెదిరే రివార్డుతో ప్రకటన విడుదల చేసిన అమెరికా ప్రభుత్వ శాఖ 
వెనిజులా అధ్యక్షుడిగా నికొలాస్ మదురో మొరోస్ మూడోసారి ఎన్నికయ్యారు. అదే సమయంలో అమెరికా ప్రభుత్వం మదురో గురించి సమాచారం అందించిన వారికి కళ్లు చెదిరే రివార్డు ఇస్తామని ప్రకటించింది. 

మదురోను అరెస్ట్ చేసేందుకు, లేదా అతడిని దోషిగా నిరూపించేందుకు అవసరమైన కీలక సమాచారం అందించిన వారికి రూ.125 కోట్లు నజరానా అందిస్తామని అమెరికా అంతర్జాతీయ నార్కోటిక్స్ అండ్ లా ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో (ఐఎన్ఎల్) ప్రకటించింది. ఫోన్, లేదా ఈ-మెయిల్ ద్వారా సమాచారం అందించాలని ఆ మేరకు వివరాలతో కూడిన ఓ ప్రకటన విడుదల చేసింది. 

కాగా, ఈ ప్రకటనను వ్యాపార దిగ్గజం ఎలాన్ మస్క్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది నిజం అంటూ మస్క్ ఆ పోస్టుపై వ్యాఖ్యానించారు. 

2013 నుంచి వెనిజులా అధ్యక్షుడిగా కొనసాగుతున్న మదురోపై తీవ్రస్థాయిలో అవినీతి, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ఆరోపణలు ఉన్నాయి. మదురో తాజాగా ఎన్నికల్లో గెలవగానే, రష్యా అధ్యక్షుడు పుతిన్ అభినందనలు తెలిపారు.


More Telugu News