వాటిపై జీఎస్టీని తొలగించండి: నిర్మలా సీతారామన్‌కు నితిన్ గడ్కరీ లేఖ
- లైఫ్, హెల్త్ ఇన్సురెన్స్ ప్రీమియంలపై జీఎస్టీని తొలగించాలని సూచన
- ఎల్ఐసీ ఉద్యోగుల సంఘం అభ్యర్థన మేరకు ఈ లేఖ రాసినట్లు వెల్లడి
- వీటిపై 18 శాతం జీఎస్టీని విధిస్తున్న కేంద్రం
లైఫ్ ఇన్సురెన్స్, హెల్త్ ఇన్సురెన్స్ ప్రీమియంలపై చెల్లించే జీఎస్టీని తొలగించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ లేఖ రాశారు. నాగపూర్ డివిజనల్ ఎల్ఐసీ ఉద్యోగుల సంఘం అభ్యర్థన మేరకు ఈ లేఖ రాసినట్లు ఆయన తెలిపారు.
జీవిత బీమా, ఆరోగ్య బీమా ప్లాన్స్‌పై జీఎస్టీని విధిస్తుండడంపై పలు వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జీఎస్టీని ఉపసంహరించుకోవాలని గడ్కరీ లేఖలో పేర్కొన్నారు. బడ్జెట్‌లో 18 శాతం జీఎస్టీని విధించిన విషయాన్ని గుర్తు చేశారు. లైఫ్ ఇన్సురెన్స్, హెల్త్ ఇన్సురెన్స్ అనేవి రక్షణ కల్పించడానికి, ప్రమాదాన్ని కవర్ చేయడానికి తీసుకునే పథకాలు అని, ఇలాంటి ప్రీమియంపై పన్ను విధింపు వద్దని గడ్కరీ కోరారు.