ఈసారి అమర్‌నాథ్ యాత్రకు రికార్డు స్థాయిలో భక్తులు
- ఈసారి అమరనాథుడిని దర్శించుకున్న 4.71 లక్షల మంది
- 48 కిలోమీటర్ల పాటు సాగే యాత్రకు 5 రోజుల సమయం
- 52 రోజుల అనంతరం ఆగస్టు 19తో ముగియనున్న యాత్ర
ఉగ్రవాదుల భయం, ప్రకృతి ప్రకోపం వంటి అనేక సవాళ్ల నడుమ సాగే అమర్‌నాథ్ యాత్రకు ఈ ఏడాది భక్తులు పోటెత్తారు. ఈసారి 32 రోజుల్లో ఏకంగా 4.71 లక్షల మంది భక్తులు హిమలింగాన్ని దర్శించుకున్నారు. గతేడాది 4.45 లక్షల మంది భక్తులు మాత్రమే యాత్ర చేపట్టగా ఈసారి అంతకుమించి యాత్రలో పాల్గొని రికార్డు సృష్టించారు.
1,654 మంది యాత్రికులతో కూడిన మరో బృందం ఈ రోజు అమర్‌నాథ్‌కు బయలుదేరింది. నిన్న 5 వేల మంది భక్తులు యాత్రలో పాల్గొనగా, ఈ తెల్లవారుజామున 3.20 గంటలకు జమ్ము నుంచి రెండు ఎస్కార్ట్ కాన్వాయ్‌లతో 1,654 మందితో కూడిన మరో బృందం యాత్రకు బయలుదేరింది.
48 కిలోమీటర్ల పొడవైన ఈ యాత్రలో అమరనాథుడి చెంతకు చేరుకునేందుకు 4-5 రోజులు పడుతుంది. 14 కిలోమీటర్ల పొడవైన బాల్టల్ గుహ ద్వారా అమరనాథుడిని దర్శించుకుని తిరిగి బేస్‌క్యాంపునకు చేరుకునేందుకు ఒక రోజు సమయం పడుతుంది. అమర్‌నాథ్ యాత్రకు హెలికాప్టర్ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. మొత్తం 52 రోజులపాటు కొనసాగే అమర్‌నాథ్ యాత్ర ఆగస్ట్ 19న శ్రావణపూర్ణిమ (రాఖీ పౌర్ణమి) రోజున ముగుస్తుంది.