అందుకే ఇంత గ్యాప్ వచ్చింది: దర్శకుడు కె. విజయ్ భాస్కర్

  • అనేక హిట్స్ ఇచ్చిన విజయ్ భాస్కర్ 
  • హీరోగా తనయుడి పరిచయం 
  • పదేళ్ల తరువాత చేసిన సినిమా 
  • క్యాష్ కంటే కథ ముఖ్యమన్న విజయ్ భాస్కర్

దర్శకుడు కె. విజయ్ భాస్కర్ పేరు వినగానే, ఆయన దర్శకత్వంలో వచ్చిన స్వయంవరం .. నువ్వేకావాలి .. నువ్వునాకు నచ్చావ్ .. మన్మథుడు .. మల్లీశ్వరి వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ కళ్లముందు కదలాడతాయి. 2013 తరువాత ఆయన నుంచి సినిమా రాలేదు. పదేళ్లుగా ఆయన ఒక్క సినిమా కూడా చేయకపోవడం విశేషం. 

ఇప్పుడు ఆయన తన తనయుడు శ్రీకమల్ హీరోగా 'ఉషా పరిణయం' అనే సినిమా చేశారు. ఈ సినిమాకి ఆయనే దర్శక నిర్మాత. ఆగస్టు 2వ తేదీన థియేటర్లకు వస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అనేక విషయాలను గురించి ప్రస్తావించారు.  

" పదేళ్ల గ్యాప్ అనుకోకుండానే వచ్చేసింది. కొన్ని ప్రాజెక్టులు మొదట్లోనే ఆగిపోతే, మరికొన్ని ప్రాజెక్టులు సెట్స్ పైకి వెళ్లే ముందు ఆగిపోయాయి. ఇక సరైన కథ దొరక్కపోవడం .. కథకి తగిన హీరోలు అందుబాటులో లేకపోవడం మరో కారణం. సినిమా తీయడానికి కావలసింది క్యాష్ కాదు .. కథ అనే నా ఆలోచన కూడా ఒక కారణం కావొచ్చు" అని అన్నారు. 



More Telugu News