వయనాడుకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. మంత్రి వీణాజార్జ్‌కు గాయాలు
ప్రకృతి బీభత్సం సృష్టించి వందలాది మందిని బలితీసుకున్న వయనాడ్‌కు వెళ్తుండగా కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణాజార్జ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో గాయపడిన ఆమె ప్రస్తుతం మంజేరిలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో చికిత్స పొందుతున్నారు.
ఆమె ప్రయాణిస్తున్న కారు మంజేరిలో తొలుత ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఆపై ఓ ఎలక్ట్రిక్ పోల్‌ను ఢీకొట్టి ఆగింది. ఈ ఘటనలో ఆమె ముఖం, చేతులకు స్వల్పంగా గాయాలయ్యాయి. కోలుకున్న అనంతరం ఆమె వయనాడ్ వెళ్లే అవకాశం ఉంది.
ఈ ఘటనలో గాయపడిన ద్విచక్ర వాహనదారుడికి కూడా చికిత్స అందిస్తున్నారు. కాగా, కొండచరియలు విరిగి పడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రస్తుతం ఈ సంఖ్య 153కు చేరుకోగా, ఇంకా 98 మంది జాడ తెలియరాలేదు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.