ఉద్యోగం వచ్చింది సెలబ్రేట్ చేసుకుందామని పిలిస్తే అత్యాచారానికి పాల్పడ్డారు!
హైదరాబాదులో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ యువతి బాల్య స్నేహితుడు, కామన్ ఫ్రెండ్ చేతిలో సామూహిక అత్యాచారానికి గురైంది. ఓ సాఫ్ట్ వేర్ సంస్థలో ఉద్యోగం పొందిన యువతి సెలబ్రేట్ చేసుకుందామని తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ రెడ్డిని, మరో కామన్ ఫ్రెండ్ ను పార్టీకి ఆహ్వానించింది.
వారు ముగ్గురూ సోమవారం సాయంత్రం వనస్థలిపురంలో ఓ హోటల్ కు అనుబంధంగా ఉన్న బార్ అండ్ రెస్టారెంట్ కు వెళ్లారు. గౌతమ్ రెడ్డి, మరో కామన్ ఫ్రెండ్ బాగా తాగి, ఆ యువతిని హోటల్ లోని రూముకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు.
దాంతో ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వనస్థలిపురం పోలీస్ ఇన్ స్పెక్టర్ జలేందర్ రెడ్డి మాట్లాడుతూ, ఆ యువతి, గౌతమ్ రెడ్డి 2వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కలిసి చదువుకున్నారని వెల్లడించారు.
ప్రయాణికురాలిపై బస్సులో అత్యాచారానికి పాల్పడిన డ్రైవర్
మరో ఘటనలో ప్రయాణికురాలిపై బస్సు డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధిత మహిళ వివాహితురాలు. నిర్మల్ నుంచి ఏపీలోని ప్రకాశం జిల్లాకు వెళుతుండగా, బస్సు డ్రైవర్ నోట్లో గుడ్డలు కుక్కి తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కాగా, ఈ ఘటన అనంతరం డ్రైవర్ కృష్ణ పరారైనట్టు గుర్తించారు. కాగా, ఆ బస్సు తార్నాక వద్ద హైదరాబాదులోకి ప్రవేశిస్తుండగా, బస్సును ఆపిన ఉస్మానియా పోలీసులు మరో డ్రైవర్ శేషయ్యను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.