వాయనాడ్ లో 70కి పెరిగిన మృతుల సంఖ్య... వరదకు కొట్టుకువస్తున్న మృతదేహాలు

  • కేరళలో భారీ వర్షాలు, వరదలు
  • వాయనాడ్ లో విరిగిపడిన కొండచరియలు
  • బురద కింద వందలాది మంది చిక్కుకుపోయి ఉంటారని భావిస్తున్న అధికారులు
  • మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం
కేరళలోని వాయనాడ్ లో భారీ వర్షాలు, వరదల కారణంగా కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 70కి పెరిగింది. పెద్ద సంఖ్యలో ప్రజలు గల్లంతయ్యారు. ఈ  విపత్తు కారణంగా వందలాది మంది గాయపడ్డారని, వారంతా వివిధ ఆసుపత్రుత్లో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. 

చురల్పార, వెలరిమల, ముందకయిల్, పోతుకలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. విపత్తు సంభవించిన ప్రాంతాలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్ తో పాటు సైన్యం, అగ్నిమాపక సిబ్బంది, స్థానిక పోలీసులు కూడా పాలుపంచుకుంటున్నారు. ప్రతికూల వాతావరణం కారణంగా కొన్ని ప్రాంతాలకు వెళ్లలేకపోతున్నామని ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది వెల్లడించారు. 

వరదకు మృతదేహాలు కొట్టుకువస్తున్నట్టు స్థానికులు చెబుతున్నారు. కాగా, బురద కింద వందలామంది చిక్కుకుపోయి ఉంటారని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.


More Telugu News