100కుపైగా దేశాలకు మేడిన్ ఇండియా టెలికం పరికరాలు
మన దేశంలో డిజైన్ చేసి, తయారుచేసిన టెలికం పరికరాలు 100కుపైగా దేశాలకు ఎగుమతి అవుతున్నట్టు కేంద్రం తెలిపింది. గతేడాది భారత్ 18.2 బిలియన్ల టెలికం పరికరాలు, సేవలను ఎగుమతి చేసింది. ప్రపంచ మార్కెట్‌లో పోటీ తీవ్రంగా ఉన్నప్పటికీ అమెరికా సహా పశ్చిమ దేశాల్లో భారత టెలికం కంపెనీలు తమ ముద్రను చాటుతున్నాయని టెలికం విభాగానికి చెందిన డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిషన్ సభ్యుడు (టెక్నాలజీ) హధు అరోరా పేర్కొన్నారు. ఇటీవల ఇండియన్ ఆర్మీ కూడా తొలి దేశీయ చిప్ ఆధారిత 4జీ మొబైల్ బేస్ స్టేషన్‌ను ఏర్పాటు చేసుకున్నట్టు ఆయన తెలిపారు.