ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో భారత్

  • అగ్రస్థానంలో కొనసాగుతున్న ఆస్ట్రేలియా
  • మూడు, నాలుగవ స్థానాల్లో నిలిచిన ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా
ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో భారత్ జట్టు టాప్-2 స్థానంలో కొనసాగుతోంది. 120 రేటింగ్ పాయింట్లతో రెండవ స్థానంలో నిలిచింది. టెస్ట్ ఫార్మాట్‌లో ఆస్ట్రేలియా జట్టు నంబర్ 1 జట్టుగా కొనసాగుతోంది. 124 రేటింగ్‌ పాయింట్లతో ఆ జట్టు అగ్రస్థానంలో ఉంది. వెస్టిండీస్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో రాణిస్తున్న ఇంగ్లండ్ జట్టు మూడో స్థానంలో నిలిచింది. ఆ జట్టు వద్ద 105 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఇక నాలుగవ స్థానంలో దక్షిణాఫ్రికా జట్టు నిలిచింది.

డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్ టాప్..
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ 2023-25లో భారత్ అగ్రస్థానంలోనే కొనసాగుతోంది. మొత్తం 74 పాయింట్లతో రెండవ స్థానంలో నిలిచింది. 68.52 శాతం విజయాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు 9 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన భారత్ ఆరు విజయాలు సాధించింది. జూన్ 2025లో డబ్ల్యూటీసీ ఫైనల్‌ స్థానమే లక్ష్యంగా దూసుకెళ్తోంది. కాగా గత రెండు డబ్ల్యూటీసీ ఎడిషన్లలో ఫైనల్ ఆడినప్పటికీ టైటిల్‌ గెలవలేకపోయిన విషయం తెలిసిందే.


More Telugu News