కేబినెట్లో మాదిగలకు చోటు కల్పించండి: సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యేల వినతి
- అసెంబ్లీ టీ బ్రేక్ సమయంలో సీఎంను కలిసిన మాదిగ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు
- తెలంగాణలో అతిపెద్ద సామాజికవర్గమని వెల్లడి
- సీఎంను కలిసిన లక్ష్మణ్, సత్యనారాయణ, శామ్యేల్, వీరేశం, లక్ష్మీకాంతారావు
రాష్ట్ర మంత్రివర్గంలో మాదిగలకు చోటు కల్పించాలని కోరుతూ ఆ సామాజిక వర్గానికి చెందిన పలువురు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయనకు వినతిపత్రం అందించారు. అసెంబ్లీ టీ బ్రేక్ సమయంలో అడ్లూరి లక్ష్మణ్, కవ్వంపల్లి సత్యనారాయణ, మందుల శామ్యేల్, లక్ష్మీకాంతారావు, వేముల వీరేశం ముఖ్యమంత్రిని కలిశారు. తెలంగాణలో అతిపెద్ద సామాజికవర్గమైన తమకు కేబినెట్లో అవకాశం కల్పించాలని కోరారు.
సీఎంను కలిసిన రైల్వే అధికారి
అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డిని రైల్వేశాఖ చీఫ్ ఇంజనీర్ సుబ్రమణ్యమ్ కలిశారు. వికారాబాద్-కృష్ణా రైల్వే లైన్ రూట్ మ్యాప్‌పై వివరించారు. వికారాబాద్, పరిగి, కొడంగల్, నారాయణపేట్, మక్తల్ మీదుగా ఈ రైల్వే లైన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. రూ.3,500 కోట్లతో 145 కిలోమీటర్ల పొడవుతో ఏర్పాటు చేయనున్న ఈ రైల్వే లైన్ రూట్ మ్యాప్‌పై ముఖ్యమంత్రి కొన్ని సూచనలు చేశారు.